తిరువనంతపురం: కేరళ వయనాడ్ లో త్రీవ విషాదం జరిగింది. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 45కు చేరింది. వయనాడ్ జిల్లాలో వేర్వేరు చోట్ల కొండచరియలు విరిగిపడడంతో మరో 70 మందికి పైగా గాయపడారు. దీంతో క్షత్రగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. స్థానికుల సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, నౌకాదళం, వైమానిక దళ సిబ్బంది సహయచర్యలు చేపట్టారు. వయనాడ్ జిల్లాలో సహాయ చర్యలు చేపట్టిన 225 మంది సైనిక సిబ్బంది. వందలాది మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వయనాడ్ జిల్లా ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ స్పందించి, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.