08-01-2026 11:01:47 AM
గజ్వేల్,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ విద్యా సంవత్సరానికి సంబంధించిన విశ్వవిద్యాలయ క్యాలెండర్‌ను వైస్ ఛాన్సలర్ డాక్టర్ దండ రాజి రెడ్డి బుధవారం అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయ క్యాలెండర్ విద్యా, పరిశోధన, విస్తరణ కార్యక్రమాలకు మార్గదర్శకంగా ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు సమయపాలనతో అకడమిక్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. విశ్వవిద్యాలయ అభివృద్ధి దిశగా చేపట్టే కార్యక్రమాలకు ఈ క్యాలెండర్ ఎంతో దోహదపడుతుందన్నారు.