23 June, 2026 | 1:32 AM

ఎల్బీనగర్‌లో స్కైవాక్

23-06-2026 12:00 AM
  1. రూ. 87 కోట్ల వ్యయంతో నిర్మాణం
  2. సుందరీకరణ, అభివృద్ధి పనులతో రూపురేఖలు   
  3. మారనున్న ఎల్బీనగర్ రింగ్ రోడ్డు 
  4. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో వేగంగా అభివృద్ధి పనులు   

ఎల్బీనగర్, జూన్ 23 : ఎల్బీనగర్ రింగ్ రోడ్డు చౌరస్తాలో రూ. 87 కోట్లతో స్కైవాక్ ఏర్పాటు చేస్తున్నట్లు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్  పేర్కొన్నారు. ఎల్బీనగర్  చౌరస్తాలో చేపడుతున్న అభివృద్ధి పనులను సోమవారం అధికారులు, నాయకులతో కలిసి   పరిశీలించారు. ఈ సందర్భంగా మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ... ఎల్బీనగర్ రింగ్రోడ్డులో స్కైవాక్ నిర్మాణంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని,  ప్రజలకు రోడ్డు దాటే అవస్థలు తప్పుతాయన్నారు. మెట్రో స్టేషన్ నుంచి నేరుగా నాలుగు వైపులా ప్రజలు వెళ్లేలా స్కైవాక్ నిర్మాణం ఉంటుందన్నారు.  కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో వేగంగా అభివృద్ధి పను లు జరుగుతున్నాయని, మొన్న బి.ఎన్.రెడ్డి నగర్‌లో ఏకో పార్కు  పనులకు శంకుస్థాపన చేసిన సీఎం తాజాగా స్కైవాక్ నిర్మాణా నికి  అనుమతులు ఇస్తూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని  పేర్కొన్నారు. అంతేకాకుండా ఎల్బీనగర్ రింగ్ రోడ్డులో వర్షం నీరు నిలువకుండా రూ.  81 లక్షలతో వరద నీటి పైప్ లైన్ నిర్మా ణం చేపడుతున్నట్లు వివరించారు.

రూ. 1.50 కోట్లతో  బ్యూటిఫికేషన్ పనులు కూ డా కొనసాగుతున్నారని పేర్కొన్నారు.  రూ. 1.37 కోట్ల వ్యయంతో రింగ్ రోడ్డు వద్ద సిసి రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ సర్కిల్ డిప్యుటీ కమిషనర్ శ్రీనివాస్, ఈఈ కార్తీక్, డీఈ కనకయ్య, యాదవ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గజ్జి భాస్కర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ధర్ప ల్లి రాజశేఖర్ రెడ్డి, వజీర్ ప్రకాశ్ గౌడ్, ముద్దగొని లక్ష్మీప్రసన్న, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షు లు కుట్ల నర్సింహా యాదవ్, మకుటం సదాశివుడు,  బుడ్డ సత్యనారాయణ, చెన్నగోని రవీందర్ గారు గౌడ్,  వేణుగోపాల్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు స్వర్ణ మాధవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్,  నేలపాటి రామారావు, పన్యాల జైపాల్ రెడ్డి,  గణేశ్ నాయక్,  నాయకులు తదితరులు పాల్గొన్నారు.