23 June, 2026 | 2:44 AM

మెనూ ప్రకారం భోజనం పెట్టాలి

23-06-2026 01:26 AM

నిర్మల్ జూన్ 22 ( విజయ క్రాంతి) విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని జిల్లా స్థానిక సంస్థల అదన కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని జనరల్ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటకా లను కూరగాయలను పరిశీలించి ఉదయం పూట పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి గురుకుల పాఠశాలలో వసతులపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డేనియల్ ఉపాధ్యాయులు సాగరిక కల్పన సునీత మేరీ తదితరులు పాల్గొన్నారు.