18 April, 2026 | 1:05 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

స్లాట్ బుకింగ్ ద్వారా ఆస్తుల రిజిస్ట్రేషన్లు

28-05-2025 09:52 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జూన్ 2 నుంచి స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు సబ్ రిజిస్టర్ అప్పారావు(Sub-Registrar Apparao) తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రతిరోజు 48 స్లాట్ బుకింగ్ లకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు 24 స్లాట్లు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 24 స్లాట్ లో ఉంటాయని వెల్లడించారు.

స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి వేలిముద్రతో పాటు ఈ సిగ్నేచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో అక్రమాలకు తావు లేకుండా ఉంటుందన్నారు. స్లాట్ బుకింగ్ లేనివారికి సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో రోజుకి ఐదు రిజిస్ట్రేషన్లను మాత్రమే చేయడం జరుగుతుందన్నారు. స్లాట్ బుకింగ్ చేసుకునేవారు registration.telangana.gov.in అనే వెబ్సైట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.