12 August, 2026 | 2:41 AM

జిల్లెలగూడలో వరద కష్టాలకు చెక్

12-08-2026 01:07 AM

శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

మీర్‌పేట్, ఆగస్టు 11 (విజయక్రాంతి): జి ల్లెలగూడలో కొన్నేళ్లుగా వేధిస్తున్న వరద ముప్పు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. చుట్టుపక్కల దాదాపు 40 కాలనీల నుంచి వచ్చే భారీ వరద నీటితో శ్రీధర్ కాలనీ, బాలాజీ కాలనీలు జలమయమై తీవ్ర ముంపునకు గురయ్యేవి.

ఈ సమస్యను మీర్పేట్ బిఆర్‌ఎస్ నేత కామేష్ రెడ్డి.. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి, తగిన బడ్జెట్తో కొత్త అవుట్ లెట్ నాలా లైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయించి కాలనీవాసులకు ముంపు సమస్య నుంచి ఉపశమనం కలిగించారు. వరద కష్టాలను దూరం చేసినందుకు గాను బాలాజీ కాలనీ వాసులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యే కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు శాంతమూర్తి, శ్రీనివాస్ రెడ్డి, హరిబాబు, కమల్ తదితరులు పాల్గొన్నారు.