28-10-2025 01:14:09 AM
రేపు ఆస్ట్రేలియాతో తొలి టీ20
-కుల్దీప్‌కు చోటు కష్టమే
-అర్షదీప్, హర్షిత్ రాణాలలో ఒకరికే ప్లేస్
కాన్‌బెర్రా, అక్టోబర్ 27 : ఆస్ట్రేలియా టూర్‌లో వన్డే సిరీస్ ముగిసింది.వరుసగా రెండు మ్యాచ్‌లో ఓడి సిరీస్ కోల్పోయిన టీమిండియా చివరి వన్డేలో మాత్రం సత్తా చాటి కంగారూలను చిత్తు చేసింది. తద్వారా టీ ట్వంటీ సిరీస్‌కు ముందు ఆత్మవిశ్వాసం పెంచుకుంది. ఇప్పుడు బుధవారం నుంచి టీ ట్వంటీ సిరీస్ మొదలుకాబోతోంది. ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ కాన్‌బెర్రా వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే భారత క్రికెటర్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తొలి టీ ట్వంటీకి తుది జట్టు ఎంపిక పెద్ద సవాల్‌గా మారింది. కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రాక్టీస్ సెషన్‌లో దీనిపైనే ఎక్కువ మా ట్లాడుకున్నట్టు కనిపించింది. బ్యాటింగ్ విభాగంలో సంచలన మార్పులేమీ ఉండకపో వచ్చు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తారు. ముఖ్యంగా ఆసియాకప్‌లో అభిషేక్ విధ్వంసం ఏ రేంజ్ సాగిందో అందరూ చూశారు. గిల్ మాత్రం టీ20 ఫార్మాట్‌లో ఇక సత్తా చాటాల్సిన టైమ్ వచ్చేసింది. వన్‌డౌ న్‌లో సూర్యకుమార్ యాదవ్, తర్వాచ తిలక్ వర్మ బ్యాటింగ్‌కు వస్తారు.
వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ బాధ్యతలు కంటిన్యూ చేయనుండగా... నితీశ్ కుమార్‌రెడ్డి ఆడడంపై సస్పెన్స్ నెలకొంది. రెండో వన్డే సందర్భంగా గాయపడిన నితీశ్‌రెడ్డి మూడో మ్యాచ్‌కు దూరమయ్యాడు. గాయం తీవ్రమైనదేమీ కాకపో వడంతో ఫిట్‌గా ఉంటే తొలి టీ ట్వంటీ లో ఆడతాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా శివమ్ దూబేకు ఛాన్స్ ఉంటుంది. ఆసియాకప్‌లో దూబే అంచనాలకు తగ్గట్టే రాణించాడు. అయితే స్పిన్ బౌలింగ్ కాంబినేషన్ గంభీర్‌కు సవాల్‌గా మారింది. ఎందుకంటే ఆసీస్ పిచ్‌లపై ముగ్గురు స్పిన్నర్ల అవసరం ఉండదు. దీంతో అక్షర్ పటేల్‌తో పాటు వరుణ్ చక్రవర్తికి చోటు ఖాయంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే మాత్రం వరుణ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు చోటు దక్కుతుంది.
దీంతో చైనామన్ బౌలర్ కుల్దీ ప్ యాదవ్‌కు నిరాశే మిగలనుంది. ఫార్మాట్‌తో సంబం ధం లేకుండా రాణిస్తున్న కుల్దీప్‌కు తగినన్ని అవకాశాలు రావడం లేదు. వన్డే సిరీస్‌లో సైతం చివరి మ్యాచ్‌లో మాత్రమే తుది జట్టు లో చోటు దక్కింది. ఇప్పుడు టీట్వంటీ సిరీస్‌లో ఎన్ని మ్యాచ్‌లకు అతనికి ప్లేస్ ఇస్తారనేది చూడాలి. మరోవైపు పేస్ విభాగంలోనూ రెం డు స్థానాలకు ముగ్గురు రేసు లో ఉన్నారు. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఖచ్చితంగా ఉంటాడు. అయితే మరో ప్లేస్ కోసం అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా పోటీ పడుతున్నారు. నిజానికి టీట్వంటీ ఫార్మాట్‌లో అర్షదీప్ సింగ్ ఎంత సూపర్ బౌలరే క్రికెట్ ప్రపంచానికి తెలుసు. ముఖ్యంగా డెత్ ఓవర్స్‌లో అద్భుతమైన బౌలింగ్ అతని సొంతం.
అదే సమయంలో గంభీర్ శిష్యుడిగా పేరున్న హర్షిత్ రాణా సిడ్నీ వన్డేలో దుమ్మురేపాడు. 4 వికెట్లతో కంగారూల పతనాన్ని శాసించాడు. ఈ నేపథ్యంలో అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలలో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందనేది చూడాలి. కాన్‌బెర్రా పిచ్ స్లో బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని అంచనా. ఇక్కడ భారీస్కోర్లు కష్టమే అయినా మ్యాచ్ సాగేకొద్దీ బ్యాటర్లకు సహకరిస్తుంది. పిచ్ పరిస్థి తిని కూడా పరిగణలోకి తీసుకుని తుది జట్టును ఎంపిక చేసేందుకు గంభీర్, సూర్యకుమార్ యాదవ్ తర్జన భర్జన పడుతున్నారు. పైగా వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్ కోసం భారత్ ప్రిపరేషన్ ఈ సిరీస్ నుంచే మొదలవుతోంది. దీంతో ఆస్ట్రేలియా సిరీస్ ద్వారా 15 మంది ఆటగాళ్ళపై క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
తొలి టీ20కి భారత తుది జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్(కెప్టెన్), సంజూ శాంసన్(కీపర్), శివమ్ దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ , వరుణ్ చక్రవర్తి, బుమ్రా , అర్షదీప్/హర్షిత్ రాణా