ఎస్‌ఎన్డీపీ నాలా పనులు ప్రారంభం
12-05-2026 12:00 AM
బడంగ్‌పేట్, మే 11 (విజయక్రాంతి): బడంగ్‌పేట్ సర్కిల్ జిల్లెలగూడ డివిజన్ మిథుల నగర్‌లో అసంపూర్తిగా నిలిచిపోయిన ఎస్‌ఎన్‌డీపీ నాలా పనులను మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాబోయే వర్షాకాలా న్ని దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు వరద ముప్పు సమస్య లేకుండా, పనులను అత్యం త వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
కార్యక్రమంలో డీసీ సమ్మయ్య, బీఆర్‌ఎస్ నాయకులు అక్కల భూపాల్‌రెడ్డి, డిప్ లాల్ చౌహాన్, అరకల కామేష్ రెడ్డి, మదారి రమేష్, ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, విజయ్, దిండు భూపేష్ గౌడ్, లక్ష్మణ్ ముదిరాజ్, గోపి యాదవ్, సునీత బాలరాజ్, సుర్వి లత, పంతంగి మాధవి, బిందు, నిర్మలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






