17 April, 2026 | 10:28 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

సోషల్ మీడియాపై నిఘా

20-06-2025 12:00 AM
  1. చైల్డ్ పోర్న్ కేసుల్లో 15 మంది అరెస్ట్
  2. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 19 (విజయక్రాంతి): తెలంగాణలో సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు సోషల్ మీడియాపై సైబర్ సెక్యూరిటీ  పూర్తిస్థాయి నిఘా ఉంటుందని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్  స్పష్టం చేశారు. ముఖ్యంగా చైల్డ్ పోర్నోగ్రఫీపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఈ క్రమం లోనే గురువారం ప్రత్యేక ఆపరేషన్‌లో 15మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

క్రైమ్ పోలీస్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో చైల్డ్ పోర్న్ వీడియోలు డౌన్‌లోడ్ చేసి, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తున్న కరీంనగర్, జగిత్యాల, వరంగల్, హైదరాబాద్ జిల్లాలకు చెందిన 15 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ 15 మంది నిందితులకు మరో 34 కేసుల్లో కూడా సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించామాన్నారు.

వీరి వయస్సు 19 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని, వీరిలో కొంతమంది ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఉన్నారని శిఖా గోయల్ పేర్కొన్నారు. ఇకపై తెలంగాణలో సోషల్ మీడియా కార్యకలాపాలపై సైబర్ సెక్యూరిటీ పూర్తి దృష్టి పెడుతుందని హెచ్చరించారు.