calender_icon.png 18 August, 2025 | 12:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి

21-09-2024 02:57:58 AM

ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ యూనియన్

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికు తెలంగాణ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ సంఘం విజ్ఞప్తి చేసింది. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకొచ్చే విషయషంపై ప్రభుత్వం ఆలోచించాలని కోరింది. నాంపల్లిలోని సంఘం కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ పదేళ్లుగా ఏపీలో పనిచేస్తున్న దాదాపు వంద మంది ఫోర్త్ క్లాస్ ఉద్యోగులను ఇక్కడికి తీసుకొచ్చేందుకు సీఎం చొరవ చూపాలని కోరారు. ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని,  ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో సీఎం సహాయనిధికి ఒక రోజు వేతనాలను అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు.