calender_icon.png 18 August, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్టోబర్ 13న అలయ్ బలయ్

21-09-2024 02:52:50 AM

అలయ్ బలయ్ ఫౌండేషన్ సమావేశంలో దత్తాత్రేయ

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): అలయ్ బలయ్ కార్యక్రమాన్ని అక్టోబర్ 13న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పా టు చేస్తున్నట్లు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. అలయ్ బలయ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మిఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక ఏళ్లుగా ఎంత ఘనంగా అలయ్ బలయ్ నిర్వహించామో ఈసారి కూడా అలాగే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే అలయ్‌బలయ్ కార్యక్రమానికి ప్రముఖులందరినీ ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. కులమతాలకు అతీతంగా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈసారి కూడా అలయ్ బలయ్‌ను ఘనంగా నిర్వహిస్తామని చైర్‌పర్సన్ విజయలక్ష్మితెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల తదితరులు పాల్గొన్నారు.