12-11-2025 12:17:14 AM
జుక్కల్ ఎమ్మెల్యే తోట
జుక్కల్, నవంబర్ 11 (విజయ క్రాంతి) : ప్రజల సమస్యలు పరిష్కారమే నాకు ముఖ్యం అని మంగళవారం క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. పలు సమస్యలతో వచ్చిన ప్రజల దగ్గర నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే నియోజకవర్గంలోని ప్రజలు పలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
అందుకోసమే తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేసి వారి సమస్యలను తెలుసుకొని తక్షణమే పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తున్నానన్నారు. అదేవిధంగా జుక్కల్ మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఇందులో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.