15 May, 2026 | 8:30 PM

Breaking News

వరి ధాన్యం నిల్వ ప్రక్రియ సక్రమంగా చేపట్టాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న వివిధ పార్టీ నాయకులు   •   డివైడర్ పై ప్రమాదకరంగా ఫ్లెక్సీలు   •   తెలంగాణ మోడల్ స్కూల్‌లో పీజీటీ ఇంగ్లీష్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం   •   బండి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి   •   సెలవులకు ఇంటికి వచ్చిన విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి   •   బాన్సువాడలో నూతన ఆర్డీఓ క్యాంప్ కార్యాలయం ప్రారంభం   •   పరీక్ష కేంద్రం వద్ద చల్లటి నీరు, అంబలి పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బొడ్డు స్పందన గంగన్న   •   జవహర్ నవోదయ పాఠశాలకు భూమి స్వాధీనం.. రైతులతో చర్చించి సరిహద్దుల ఖరారు   •   ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి   •  

మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సోమయ్య

15-05-2026 07:49 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాటు సోమయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కేంద్రానికి చెందిన సోమయ్య చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే సేవలందిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయన చేసిన సేవలను గుర్తించి శుక్రవారం కోరుట్ల నియోజకవర్గం ఇన్‌చార్జ్ జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు సోమయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. తన నియామకానికి సహకరించిన పార్టీ ఒక్కోరికీ సోమయ్య కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, నాయకులు అందరూ తనకు అండగా ఉండాలని కోరారు.