కాస్త రిలాక్స్ !
27-05-2024 01:02 AM
జయశంకర్ భూపాలపల్లి, మే 26(విజయక్రాంతి): ప్రశాంతంగా పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వేళ పోలీసులు కాస్త రిలాక్స్ అయ్యారు. ఎన్నికల హడావుడిలో కాస్త తీరిక లేకుండా బిజీబిజీగా గడిపిన పోలీసు ఉన్నతాధికారులు సరదాగా కాసేపు.. అన్నట్లుగా ఆత్మీయ విందు ఏర్పాటు చేసుకున్నారు. భూపాలపల్లిలోని ఇల్లెందు క్లబ్‌లో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది, కుటుంసభ్యులతో కలిసి ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా జిల్లా ఎస్పీ కిరణ్ ఖరేతో పాటు ఉన్నతాధికారులు ఆనందంతో సినిమా పాటలకు స్టెప్పులు వేశారు. పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారులను ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు.






