27 March, 2026 | 2:01 AM

ఆదర్శ కుటుంబంలో ప్రత్యేకం!

27-03-2026 12:16 AM

విక్టరీ వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న కొత్త చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’ (ఏకే 47). ఈ సినిమా చిత్రీకరణ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతు న్నాయి. ఇందులో కథానాయికగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించ లేదు. అయితే ఇప్పు డు ఈ సినిమాలో పూజా హెగ్డే కూడా భాగం కాబోతున్నట్లు సమాచారం.

త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా హెగ్డే పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. వీరి కలయికలో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’, ‘అల వైకుంఠపురంలో’ సినిమా లు రెండూ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. ఆ తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు త్రివిక్రమ్ మరోసారి పూజా కు ఛాన్స్ ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందులో శ్రీనిధి శెట్టి మెయిన్ హీరోయిన్ కాగా.. ఓ స్పెషల్ సాంగ్‌నున పూజాహెగ్డేతో ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో నారా రోహిత్ నటిస్తున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఆయన ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని, ఇది కథలో చాలా కీలకమైన రోల్ అని అంతా చెప్పుకొంటున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సిని మాను 2026 వేసవిలో రిలీజ్ చేయనున్న ట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ ఏ డాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముం దుకు వచ్చే అవకాశం ఉంద ని టాక్.