31 March, 2026 | 2:41 AM

ప్రియురాలికి హార్థిక్ ఖరీదైన గిఫ్ట్

31-03-2026 12:53 AM

ముంబై, మార్చి 30 : భారత స్టార్ క్రికెటర్ హార్థిక్ పాండ్యా ఆటతో పాటు తన వ్యక్తి గత విషయాలతోనూ తరచుగా వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా తన గాళ్‌ఫ్రెండ్ మహికాశర్మకు ఖరీదైన బెంజ్ కారు బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు. భార్య నటా షా స్టాంకోవిచ్‌తో విడిపోయిన తర్వాత హార్థి క్ మహికాతో డేటింగ్‌లో ఉన్నాడు. ఆమెతో పూర్తిగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ స్టార్ ఆల్‌రౌండర్ సుమారు రూ.1.7 కోట్ల మెర్సిడెజ్ బెంజ్ వీ క్లాస్ కారును మహికాకు గిఫ్ట్‌గా ఇచ్చాడు.

షోరూంకు తీసుకెళ్లి కారు డెలివరీ తీసుకుంటున్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. గత వారం రూ.12 కోట్ల ఖరీదైన ఫెరారీ కారును కొనుగోలు చే సి ముంబై రోడ్లపై షికారు చేసిన పాండ్యా ఇప్పుడు ప్రియురాలిని కూడా సంతోషెపట్టాడు. రెండు నెలల క్రితం తన మాజీ భార్య తో ఉంటున్న కుమారుడు అగస్త్య కోసం రూ.4 కోట్ల విలువ చేసే కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు. మొత్తం మీద గత నెల రోజులుగా కార్ల కోసమే పాండ్యా రూ.20 కోట్ల వరకూ ఖర్చు చేశాడు.