calender_icon.png 9 December, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోడుప్పల్ లో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

09-12-2025 06:43:40 PM

మేడిపల్లి (విజయక్రాంతి): అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను బోడుప్పల్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కీలకపాత్ర పోషించిన సోనియాగాంధీ చారిత్రక పాత్రను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నర్సింహారెడ్డి, బోడుప్పల్ నగరపాలక సంస్థ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, సీనియర్ నాయకులు రాపోలు రాములు, మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.