09-12-2025 02:10:14 PM
కేక్ కట్ చేసిన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలు మంగళవారం జిల్లా కేంద్రంలోని డీసీసీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్ నియోజక వర్గ ఇన్‌చార్జి అజ్మీర శ్యాంనాయక్‌తో కలసి సుగుణ కేక్ కట్ చేసి నాయకులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సుగుణ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధనలో సోనియా గాంధీ పాత్ర అపారమైనది. ఆమె దూరదృష్టితోనే తెలంగాణ రాష్ట్రం వెలుగులోకి వచ్చిందని అన్నారు. రాష్ట్ర అభ్యున్నతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండ శ్యామ్, మాజీ ఎంపీటీసీ సిడం తిరుపతి సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, మంగ,గడ్డల సత్తయ్య,లింగు, విజయ్ ఉప్రే,కోవ ఇందిర, విజయ,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.