20 July, 2026 | 7:08 PM

Breaking News

పాఠశాలకు వాటర్ ప్లాంట్ విరాళం   •   కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి   •   నూతన ఎస్‌ఐ అనిల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉపసర్పంచ్   •   విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి: షీటీం ఎస్ఐ ఫజల్ ఖాన్   •   మితిమీరిన వేగంతో డ్రైవింగ్... కారు బోల్తా యువకుడు మృతి   •   నీట్ పేపర్ లీక్ - కేంద్ర మంత్రి రాజీనామాకు పీవైఎల్ డిమాండ్   •   ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే పునఃప్రారంభించాలి: డాక్టర్ వై. అనూప్ రావు   •   కాంగ్రెస్ హయాంలోనే మహిళలకు పెద్దపీట - కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్   •   కెల్లేడులో సర్ శత శాతం పూర్తి   •   ఉపసర్పంచులకు విబి జీ రామ్ జీ జాయింట్ చెక్ పవర్ అమలు చేయాలి   •  

సోఫియా.. ఒడిశా తొలి ముస్లిం ఎమ్మెల్యే

09-06-2024 02:33 AM

భువనేశ్వర్, జూన్ 8: ఒడిశాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళ చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బారాబాటి కటక్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన సోఫియా ఫిర్దౌస్.. ఒడిశా అసెంబ్లీలో అడుగు పెడుతున్న మొట్టమొదటి ముస్లిం మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె బీజేపీ అభ్యర్థి పూర్ణచంద్ర మహాపాత్రను 8001 ఓట్ల తేడాతో ఓడించారు. సోఫియా ఫిర్దౌస్‌కు ప్రస్తుతం 32 ఏండ్లే. ఆమె సీనియర్ కాంగ్రెస్ నేత మొహమ్మద్ మోక్విమ్ కూతురు. ఈసారి తండ్రి స్థానంలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది.

కలింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీలో సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ చదివిన ఆమె, బెంగళూరు ఐఐఎంబీ నుంచి 2022లో ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం పూర్తిచేశారు. 2023లో ఆమె ది కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) భువనేశ్వర్ చాప్టర్ ఆఫ్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. సీఐఐ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ భువనేశ్వర్ చాప్టర్ కో చైర్‌పర్సన్ కూడా. ఆమె షేక్ మిరాజుల్ హక్ అనే వ్యాపారవేత్తను వివాహమాడారు. ఒడిశా మొదటి మహిళా ముఖ్యమంత్రి నందినీ సత్పతిని ఫిర్దౌస్ అమితంగా ఇస్టపడుతారు. నందిని కూడా 1972లో బారాబాటీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.