భగవంతుని ధ్యానంతోనే ఆత్మ సంతృప్తి
చాలీసా పారాయణంలో రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా
జవహర్ నగర్, జులై 28 (విజయక్రాంతి): భగవంతుని ధ్యానంలోనే ఆత్మ సంతృప్తి లభిస్తుందని ఆత్మ సంతృప్తి మోక్షమార్గానికి మొదటి మెట్టు హనుమాన్ చాలీసా యే అని అని జవహర్ నగర్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా పేర్కొన్నారు. హనుమాన్ చాలీసా పారాయణం అందరికీ శ్రేయస్కరం... శుభకరం దినకరమన్నారు.
సదాచారి గురుస్వామి ఆధ్వర్యంలో మూడవ రోజు నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా కార్యక్రమానికి జవహర్ నగర్ నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్త మంగళవారం ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ఐదు రోజులు ప్రతిరోజు 108 హనుమాన్ చాలీసా పారాయణాలు చేయాలనే సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమం జవహర్ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఎంతో శ్రేయస్కరమని అన్నారు ఈ కార్యక్రమానికి వర్షం కారణంగా అంతరాయం కలిగినప్పటికీ హనుమాన్ చాలీసా పారాయణాన్ని సదా చారి గురుస్వామి వారి బృందం నిరాశ నిస్పృహలకు గురి కాకుండా ఉత్సాహంగా చాలీసా పారాయణాన్ని కొనసాగించడం ఎంతో గర్వించదగ్గ విషయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో రమేష్ చారి, విజయ్, మురళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు






