26 February, 2026 | 7:37 AM

పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ వీడ్కోలు వేడుకలు

26-02-2026 12:14 AM

పినపాక, ఫిబ్రవరి 25, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, జానంపేట జడ్పీఎస్‌ఎస్ పాఠశాలలో బుధవారం 2026 పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ వీడికోలు వేడుకలను  ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మీయ వీడ్కోలు వేడుకల్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థిని విద్యార్థులు 100% మార్కులతో రాణించి జానంపేట పాఠశాలకి మంచి పేరు తీసుకురావాలని కోరారు. పదవ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకు స్థానిక గ్రామ పెద్ద ముళ్ళపూడి ప్రకాశం  విద్యార్థిని విద్యార్థులకు  పరీక్ష సామాగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.