26 February, 2026 | 7:18 AM

గొందిగూడెం ఆశ్రమ పాఠశాలలో ఫేర్వెల్ డే

26-02-2026 12:11 AM

అశ్వాపురం, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): అశ్వాపురం మండలంలోని గొందిగూడెం ఆశ్రమ పాఠశాలలో బుధవారం ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. వేదికను అందంగా అలంకరించి నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ ప్రధాన ఉపాధ్యాయులు వారి భవిష్యత్తు విజయవంతంగా ఉండాలని ఆకాంక్షించారు.

క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఉపాధ్యాయ సిబ్బంది కూడా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, పాఠశాల పేరు ప్రతిష్టలను పెంచేలా కృషి చేయాలని ప్రోత్సహించారు. విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆనందోత్సాహాల మధ్య నిర్వహించిన ఈ ఫేర్వెల్ డే వేడుకలు విద్యార్థుల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచాయి. ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.