15 June, 2026 | 2:24 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

గవర్నర్‌ను కలిసిన ద.మ రైల్వే జనరల్ మేనేజర్

25-03-2026 12:29 AM

సికింద్రాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మంగళవారం లోక్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టు ల పురోగతి, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై గవర్నర్కు వివరించారు. తెలం గాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆయన వివరించారు. గవర్నర్ ఈ సందర్భంగా రైల్వే శాఖ చేపడుతున్న అభి వృద్ధి కార్యక్రమాలను ప్రశంసిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి రైల్వే రంగం కీలకమని పేర్కొన్నారు.