1 July, 2026 | 6:35 PM

Breaking News

రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •   గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న   •  

దక్షిణకొరియా అధ్యక్షుడి అరెస్ట్

16-01-2025 01:50 AM

* ఎమర్జెనీ విధింపు నిర్ణయంతోనే కటకటాల పాలు

సియోల్, జనవరి 15: ఉన్నట్టుండి దేశం లో ఎమర్జెన్సీ ప్రకటించి దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కటకటాల పాలయ్యారు. ప్రతిపక్ష పార్టీ నేతలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని డిసెంబర్‌లో దేశంలో ‘ఎమర్జెన్సీ మా ర్షల్ లా’ విధించారు. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.

దేశా ధ్యక్షుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రతిపక్షాలు ఈ క్రమంలో పార్లమెంట్‌లో అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం పెట్టాయి. చట్టసభలో అభిశంసన తీర్మానం నెగ్గడంతో యూన్ సుక్ యోల్ అధ్యక్ష అధికారాలు కోల్పోయారు.

ఈ క్రమంలో బుధవారం ఉదయం సియోల్‌లోని యూన్ సుక్ యోల్ నివాసంలో దర్యాప్తు సంస్థల అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి ఆయన్ను కొద్దిరోజుల క్రితమే అదుపులోకి తీసుకోవాల్సి ఉండగా, అధికారులకు అనేక అవాంతరాలు ఎదుర య్యాయి. దీంతో అరెస్ట్ సాధ్యం కాలేదు. తాజాగా అధికారులు పక్కా వ్యూహం రచించి యూన్ సుక్ యోల్‌ను అదుపులోకి తీసుకున్నారు.