1 July, 2026 | 6:46 PM

Breaking News

విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •  

గీతం 17వ గ్రాడ్యుయేషన్ డే ఆగస్టు 1న

01-07-2026 06:03 PM

పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు తన విద్యార్థుల విద్యా ప్రయాణంలో ఒక కీలక ఘట్టాన్ని సూచించే 17వ పట్టభద్రుల ప్రదానోత్సవం (గ్రాడ్యుయేషన్ డే)ను ఆగస్టు 1, 2026న (శనివారం) నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని గీతం రిజిస్ట్రార్ డాక్టర్ డి. గుణశేఖరన్ బుధవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. 2025-26 విద్యా సంత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ), పీహెచ్.డీ. కోర్సులను విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులు ఈ పట్టభద్రలు ప్రదానోత్సవంలో పాల్గొనడానికి అర్హులని తెలియ జేశారు. ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, సైన్స్, ఫార్మసీ, హ్యుమానిటీస్, ఆర్కిటెక్చర్ వంటి వివిధ విభాగాలకు చెందిన పట్టభద్రులు తమ విద్యాపరమైన విజయాలను వేడుకగా జరుపుకోవడానికి ఈ కార్యక్రమం వేదిక కానుందన్నారు.

అర్హులైన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి 2026, జూలై 3 నుంచి 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పేర్ల నమోదు (రిజిస్ట్రేషన్), స్నాతకోత్సవానికి సంబంధించిన సమగ్ర వివరాలు, మార్గదర్శకాల కోసం విద్యార్థులు గీతం అధికారిక వెబ్ సైట్ www.gitam.edu ను సందర్శించాలన్నారు. తమ వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలలో తదుపరి దశను ప్రారంభించబోతున్న విద్యార్థులకు, యూనివర్సిటీ నాయకత్వం, అధ్యాపకులు, తల్లిదండ్రులు, ప్రముఖ అతిథుల సమక్షంలో తమ విద్యాపరమైన విజయాలను గుర్తుచేసుకునే అవకాశాన్ని ఈ పట్టభద్రుల ప్రదానోత్సవం కల్పిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.