25-05-2025 12:36:02 AM
న్యూఢిల్లీ, మే 24: కేవలం పహల్గాం ఉగ్రదాడి కారణంతో 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయలేదని ఒప్పందం రద్దుకు అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయని శుక్రవారం ఐక్యరాజ్య సమి తిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పేర్కొన్నారు. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు గురించి ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించిన పాకిస్థాన్‌కు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు.
పాకిస్థాన్ రాయబారి ఇఫ్తికర్ అహ్మద్ కశ్మీర్ అంశంతో పాటు ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల గురించి కూడా ప్రస్తావించగా.. భారత ప్రతినిధి హరీష్ దీటుగా బదులిచ్చారు. పాక్ ఇప్పటికీ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్‌కు నష్టం చేకూర్చాలని చూస్తోందని తెలిపారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి కూడా ఆ కోవలోకే వస్తుందని పేర్కొన్నారు.
స్నేహ స్ఫూర్తితో ఒప్పందం కుదిరింది కానీ..
ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో సిం ధు జలాల ఒప్పందం కుదిరిందని ఆనాటి నుంచి పాక్ భారత్‌పై విషం వెళ్లగక్కుతూనే ఉందన్నారు. ‘65 ఏండ్ల కిందట భారత్ ఈ ఒప్పందంలో చేరింది. స్నేహస్ఫూర్తితో ఈ ఒప్పందం కుదిరింది. గడిచిన ఆరున్నర దశా బ్దాలుగా మూడు యుద్ధాలు, వేలసార్లు ఉగ్రవాద దా డులు చేసి పాక్ ఈ ఒప్పంద స్ఫూర్తిని ఉల్లంఘిస్తూనే ఉంది.
గత నాలుగు దశాబ్దాలుగా 20వేల పైచిలుకు భారతీయులు ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. పాక్ ఇన్ని దురాగతాలకు పాల్పడుతున్న భారత్ సహనంతోనే వ్యవహరించింది. పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్‌లోని అనేక మంది అమాయకులను పొట్టన పెట్టుకుంది.’ అని అన్నారు.
అదొక్కటే కారణం కాదు
సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడానికి సీమాంతర ఉగ్రవాదం ఒక్కటే కారణం కాదని హరీష్ పేర్కొన్నారు. ‘సీమాంతర ఉగ్రవాదం ఒక్కటే కాదు. ఆనకట్టల భద్రత, వాతావరణ మార్పులు, భౌగోలిక మార్పులు, ఇతరేత్ర కారణాలతో ఒప్పందం రద్దు చేశాం.’ అని హరీష్ పేర్కొన్నారు.
విదేశాంగ శాఖ నోట అదే మాట..
సింధు జలాల రద్దు ఒప్పందాన్ని భారత విదేశాంగ శాఖ కూడా సమర్థించింది. విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్రీ పార్లమెంటరీ కమిటీకి వివరణ ఇస్తూ 1960ల నాటి సింధు జలాల ఒప్పందం స్నేహపూర్వక స్ఫూర్తితో కుదిరిందని తెలిపారు. ‘ఈ ఒప్పందం స్నేహపూర్వక స్ఫూర్తితో కుదిరింది. కానీ పాకిస్థాన్ అనేక రోజుల నుంచి ఈ సూత్రాలను ఉల్లంఘిస్తోంది.
సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. వాతావరణ మార్పుల వల్ల ఆనకట్టల్లో మార్పులు చేయాల్సి వచ్చింది. మరోసారి చర్చలు జరగాలి. కానీ పాకిస్థాన్ చర్చల కోసం ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఎన్ని సార్లు చర్చలకు ఆహ్వానించినా తిరస్కరిస్తూనే వస్తుంది’. అని విదేశాంగ శాఖ పేర్కొంది.
ఉస్మానియాలో చదివిన హరీష్
భారతీయ దౌత్యవేత్త పర్వతనేని హరీష్ విశాఖపట్నంలో జన్మించారు. హరీష్ పాఠశాల విద్యాభ్యా సం, కాలేజీ విజయవాడలో పూర్తవగా.. ఉస్మాని యా విశ్వవిద్యాలయంలో మెకా నికల్ ఇంజనీరి ం గ్ చేశారు. మెకానికల్‌లో గోల్డ్ మెడల్ సాధించిన పర్వతనేని.. తర్వాత కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెం ట్‌లో కూడా పోస్ట్ గ్రా డ్యుయేషన్ పూర్తి చేశారు.
ఆ తర్వాత 1990లో ఇ ండియన్ ఫారిన్ సర్వీసెస్ (ఐఎఫ్‌ఎస్) అధికారిగా ఎంపికయ్యారు. ఆయన తండ్రి ప్రసాద్ 1968వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి. హరీ ష్ వివిధ దేశాలకు భారత రాయబారిగా విధులు నిర్వర్తించారు. 2024 ఆగస్టు 14 నుంచి ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పర్వతనేని హరీష్‌కు ఇద్దరు సంతానం.