calender_icon.png 10 May, 2025 | 2:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్భయంగా పోలీసులను ఆశ్రయించవచ్చు

17-03-2025 03:49:01 PM

ఎస్పీ డీవీ శ్రీనివాసరావు 

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రజలు తమ సమస్యలు విన్నవించుకునేందుకు నిర్భయంగా పోలీసులను ఆశ్రయించవచ్చని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు(SP DV Srinivasa Rao) అన్నారు. సోమవారం తన కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల అందజేసిన సమస్యలపై సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలకు తావు ఇవ్వకుండా ప్రజల కోసం నిరంతరం పనిచేయడం జరుగుతుందని తెలిపారు.