4 July, 2026 | 9:58 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

కేసుల దర్యాప్తులో సాంకేతికత వినియోగించాలి

19-06-2025 12:44 PM

వెల్దండ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ గైక్వాడ్  వైభవ్ రఘునాథ్

కల్వకుర్తి: కల్వకుర్తి సబ్ డివిజన్ వెల్దండ పోలీస్ స్టేషన్ ను గురువారం జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రికార్డులు, క్రైమ్ ఫైల్స్, పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కేసుల దర్యాప్తులో సాంకేతికత పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. ప్రజలతో మర్యాదగా ఉండాలని, పోలీసుల పట్ల గౌరవం పెంపొందేలా విధులు నిర్వర్తించాలని, పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో గల ప్రతి గ్రామం పైన సిబ్బంది అందరికీ అవగాహన కలిగి ఉండాలని, పెట్రోలింగ్, బ్లూ కోర్ట్ విధులు విధిగా నిర్వహించాలని సిబ్బందికి  సూచించారు.