calender_icon.png 9 January, 2026 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతర బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

07-01-2026 12:26:09 AM

ఉట్నూర్, జనవరి 6 (విజయక్రాంతి): ఈనెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే నాగోబా జాతర ఉత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ తరపు నుంచి చేపట్టే బందోబస్తు ఏర్పాట్లను  జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  పరిశీలించారు. మంగళవారం సాయంకాలం నాగోబా ఆలయానికి చేరుకున్న ఎస్పీ ఏఎస్పీ కాజల్ సింగ్ తో కలిసి నాగోబా దేవుడికి పూజలు నిర్వహించారు. అనంతరం జాతర సందర్భంగా బందోబస్తుతో పాటు జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా రోడ్డులను పరిశీలించారు. 

జాతర  సందర్భంగా చట్ట వ్యతిరేక పనులు, దొంగతనాలు, జూదం, లాటరీలు ప్రజలను మోసగించే పనులు చేసే వారిపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. ఎస్పీ తో  శిక్షణ ఐపీఎస్ అధికారి రాహుల్ కాంత్,  డి.ఎస్.పి పోతారం శ్రీనివాస్, సీఐ  మడవి ప్రసాద్, ఎస్సై సాయన్న, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.