calender_icon.png 6 February, 2026 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

06-02-2026 07:07:35 PM

డిపిఎం సురేష్ కుమార్

సదాశివనగర్,(విజయక్రాంతి): మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా ఎదిగి ముందుకు సాగాలని ఐకెపి జిల్లా అధికారి సురేష్ కుమార్ అన్నరు. మండల కేంద్రంలోని కొల్లకొండ మల్లవ్వకు గొర్రె పొట్టేళ్ల పెంపకం కోసం రూ.రెండు లక్షల ఋణాన్ని అందించారు. ఋణం ద్వారా గొర్రె పొట్టేళ్లలను పోషించి 8 నెలలు పెంపకం చేసి వాటిని అమ్ముకొని వచ్చే ఆదాయం ద్వారా లోను చెల్లించుకోవాలని డిపిఎం సురేష్ సూచించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డిపిఎం సురేష్ కుమార్,మరియు గ్రామ సర్పంచ్ వంకాయల శిరీష, ఉపసర్పంచ్ ప్రవీణ్,మండల సమైక్య కోశాధికారి భూదేవి, ఎపియం ప్రసాద్, వార్డు సభ్యులు గ్రామ సంఘం అధ్యక్షురాలు భూదేవి, సీసీ ఆంజనేయులు, వివోఏలు పద్మ నూతన, లావణ్య తదితరులు పాల్గొన్నారు.