calender_icon.png 3 May, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగారం పోలీస్ స్టేషన్ పరిశీలించిన ఎస్పీ నర్సింహ

24-04-2025 01:20:10 AM

నాగారం, ఏప్రిల్ 23: పోలీస్ స్టేషన్లో సాధారణ తనిఖీలలో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు నాగారం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందితో మాట్లాడారు. సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి సలహాలు సూచనలు చేసినారు. మండల పరిధిలో ఎలాంటి అవాంఛను సంఘటనలు జరగకుండా ముందస్తు సమాచారం సేకరిస్తూ ఇబ్బంది ఇంటలిజెన్స్ తో పనిచేయాలని తెలిపారు.

పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న పలు రికార్డులను పరిశీలించారు. ఐలాండ్ ఫిర్యాదులు పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని దర్యాప్తు చేసి బాధితులకు పోలీస్ శాఖ పై నమ్మకం కలిగించాలని ఆదేశించారు.

ఇసుక రవాణాకు సంబంధించి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని ఇసుక అక్రమ రవాణా చేసే వాహనదారులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.  ఎస్పీ వెంట సూర్యాపేట డివిజన్ డిఎస్పి పార్థసారథి, నాగారం రఘువీర్ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.