24-04-2025 01:17:29 AM
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి
దేవరకొండ, ఏప్రిల్ 23: కశ్మీర్ లోని పహాల్గంలో పర్యాటకులపై బుల్లెట్లతో దాడులు చేసిన పాకిస్తాన్ ప్రేరేపిత లస్కరే తోయిబా ఉగ్రవాదులను అంతమొందించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి డిమాండ్ చేసారు.
గురువారం దేవరకొండ లోని స్థానిక పార్టీ కార్యాలయంలో నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఉగ్రదాడిలో మరణించిన వారికి రూ.కోటి, గాయపడిన పౌరులకు రూ .25 లక్షల నష్ట పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలన్నారు.
కశ్మీర్లో పర్యాటకులను కిరాతకంగా చంపిన ఉగ్రవాదులను అంతమొందించాలని, ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్ ను ప్రపంచవ్యాప్తంగా ఒంటరి చేయాలని, వాణిజ్య, వ్యాపార, పర్యాటక రంగాలపై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో కేంద్రం ప్రభుత్వం విఫలం చెందిందని ధ్వజమెత్తారు. మృతుల కుటుంబాలకు సీపీఐ పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.