11 April, 2026 | 8:28 PM

ఓటు మనందరి బాధ్యత

13-05-2024 01:32 AM

జిల్లా ఎన్నికల అధికారి సంతోష్ 

వనపర్తి (గద్వాల), మే 12 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికలకు సంబం ధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని, సోమవారం జరిగే ఎన్నికల్లో జిల్లా ప్రజలందరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి సంతోష్ సూచించారు. ఆదివారం పట్టణంలోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి సిబ్బంది పోలింగ్ సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గ పరిధిలో 303 పోలింగ్ కేంద్రాలు, అలంపూర్ నియోజకవర్గ పరిధిలో 291 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పోలింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామని, ఓటు వేయడం మనందరి భాధ్యతనన్నారు. 

అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ రితిరాజ్

పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమ త్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి ఎస్పీ రితిరాజ్ సూచించారు. ఆదివారం ఎన్నికల విధు లు నిర్వహిస్తున్న సిబ్బందికి ఆమె పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రతి ఒక్కరు క్యూ పద్ధతితో పాటించేలా చూడాలని, ఎవరికీ కేటాయించిన విధులను వారు భాధ్యతగా నిర్వర్తించి పోలింగ్ ప్రక్రి య సజావుగా జరిగేందుకు కృషి చేయాలన్నారు. ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఒక్కరి ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని చెప్పారు. పోలింగ్ కేంద్రం వద్ద అనుమానస్పదంగా ఎవరైనా వ్యక్తులు కనిపించినా, ఏదైనా సమస్య తలెత్తినా వెంటనే రూట్ మొబై ల్ ఇన్‌చార్జి అధికారులకు, స్థానిక పోలీ సు అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ గుణశేఖర్, డీఎస్పీ సత్యనారాయణ, శ్రీధర్, సాయుధ దళాల డీఎస్పీ నరేందర్ పాల్గొన్నారు.