13-10-2025 05:52:48 PM
వనపర్తి టౌన్: జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంకు 10 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఆయా మండలాల ఎస్ఐలకు అదేశాలు జారీ చేశారు.