calender_icon.png 13 October, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా తెలంగాణ తొలి స్పీకర్ జన్మదిన వేడుకలు

13-10-2025 09:01:56 PM

హనుమకొండ (విజయక్రాంతి): తెలంగాణ మొట్టమొదటి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలను కేక్ కోసి, స్వీట్లు పంచుకొని హనుమకొండలో ఘనంగా నిర్వహించారు. మధుసూదనాచారి జయంతి వేడుకల్లో భాగంగా హనుమకొండలోని సహృదయ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం కేయూ ఆచార్య గడ్డం భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం గడ్డం భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ తొలి స్పీకర్ మధుసూదనాచారి తెలంగాణ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారన్నారు.

పేదల కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో తాళ్లపల్లి రామస్వామి గౌడ్, సురేందర్, మునీరుద్దీన్, మదర్ అసిఫ్, సాయికుమార్, మహిళలు పాల్గొని చారి సేవలను కొనియాడుతూ మరింత ఉన్నతమైన పొంది బడుగు బలహీన వర్గాల సంక్షేమం గురించి పాటుపడటానికి కావలసిన ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు కల్పించాలని చారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.