13-10-2025 08:24:37 PM
ఉప్పల్ (విజయక్రాంతి): ఖైదీలను సత్ప్రవర్తన గల పౌరులుగా మార్చేందుకు వారికి ఉపాది, శిక్షణ కల్పించేందుకు తెలంగాణ జైళ్లశాఖ చేస్తున్న సంస్కరణలు చాలా బాగున్నయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) అన్నారు. చర్లపల్లి ఖైదీల వ్యవసాయక్షేత్రంలో పబ్లిక్ ప్రైవేట్ భాగసామ్యంతో ఏర్పాటు చేసిన అడ్వెంచర్ పార్కును తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్ర ఐపీఎస్ తో కలసి సోమవారం సందర్శించారు. ఈనందర్భంగా చర్లపల్లి ఒపెన్ జైల్లో సేంద్రియ ఏరువులతో పండిస్తున్న కూరగాయలను, పంటలను, పూల తోటలను సందర్శించారు. డైరీని సందర్శించి పశుపోషణలో ఖైదీలు చూపిస్తున్న కృషిని ఆయన అభినందించారు. అవులకు గడ్డి తినిపిస్తూ ఇటీవల పుట్టిన లేగదూడకు కృష్ణ అని నామకరణం చేశారు.
అనంతరం చర్లపల్లి సెంట్రల్ జైలులో ఖైదీలు తయారు చేస్తున్న వస్తూ ఉత్పత్తులను, పరిశ్రమలను పరిశీలించారు. ఖైదీల బ్యారక్లను, ఆసుపత్రిని సందర్శించి ఖైదీలకు కల్పిస్తూన్న సౌకర్యాల గుర్చి ఖైదీలతో మాట్లాడారు. ఖైదీలను సత్ ప్రవర్తణ గత పౌరులుగా మార్చేందుకు తెలంగాణ జైళ్ల శాఖ చేస్తున్న సంస్కరణల గుర్చి అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్తో వివరించారు. మంత్రి బండి నయిజయకుమార్ మాట్లాడుతూ ఈప్రాజెక్ట్ యువతిలో ముఖ్యంగా పిల్లలలో వ్యవసాయంపై అసక్తి పెంచుతుందని తెలిపారు. భవిష్యత్తులో జైల్లో శాఖ చేస్తున్న సంస్కరణలను మరింత బలోపేతం చేసేందుకు భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్ర, బజీ మురళీబాబు, డిబజీలు డాక్టర్ శ్రీనివాస్, ఎం సంపత్, చర్లపల్లి సెంట్రల్ జైలు, ఒపెన్ జైలు సూపరింటెండెంట్లు శివకుమార్ గౌడ్, కాళీదాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.