calender_icon.png 13 October, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయవంతంగా ముగిసిన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా కబడ్డీ పోటీలు

13-10-2025 08:51:22 PM

విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్..

పటాన్ చెరు: పటాన్ చెరు పట్టణంలోని మైత్రి మైదానం కేంద్రంగా జరుగుతున్న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా కబడ్డీ టోర్నమెంట్ ముగింపు వేడుకలు సోమవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. విజేతలకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బహుమతులు పంపిణీ చేశారు. పోటీలలో విజేతలుగా నిలిచిన చెట్లు ఈనెల 16వ తేదీ నుండి పటాన్ చెరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల చరిత్ర గలిగిన మైత్రి మైదానాన్ని రాష్ట్ర జాతీయ క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు సంపూర్ణ సహకారం అందిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేలా అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. విద్యతోపాటు క్రీడలను సైతం ప్రోత్సహించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మైత్రి క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్రీనివాసరావు, ఎంఈఓ పటాన్ చెరు నాగేశ్వర్ నాయక్, కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముక్తార్ జానీ, సీనియర్ ప్లేయర్, మాజీ ప్రెసిడెంట్ ఎల్లయ్య, గౌసుద్దీన్ పాల్గొన్నారు.