13-10-2025 08:26:26 PM
చిలుకూరు: యూరియా పక్కదారి పట్టకుండా అవసరమైన రైతులకు అందించేందుకు చిలుకూరు పిఏసిఎస్ ప్రత్యేక కార్డులను పంపిణీ చేసింది. చైర్మన్ అలస కాని జనార్ధన్, సీఈవో లక్ష్మీనారాయణ సోమవారం రైతులకు ఈ కార్డులను అందజేశారు. ఆధార్, పాస్ బుక్ ఆధారంగా సొసైటీ పరిధిలోని అన్ని గ్రామాల రైతులకు వీటిని పంపిణీ చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.