calender_icon.png 13 October, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

13-10-2025 08:42:20 PM

మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి..

అమీన్ పూర్: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో ప్రజల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు అమీన్ పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి తెలిపారు. సోమవారం అమీన్ పూర్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.

ప్రధానంగా మంచినీరు, నిరంతర విద్యుత్, పాఠశాల, అంగన్వాడి తదితర సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. త్వరలో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాలనీలో ఎటువంటి సమస్యలు ఉత్పనమైన తన దృష్టికి తీసుకొని రావాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ కల్పన ఉపేందర్ రెడ్డి, మల్లేష్, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు.