13-10-2025 06:01:57 PM
నిర్మల్ రూరల్: నిర్మల్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈనెల 8న అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని గుర్తించిన పోలీసులు ఏరియా ఆసుపత్రిలో వైద్యం కోసం చేర్పించగా ఆరోగ్యం క్షీణించి మృతి చెందడం జరిగిందని చేతిపై గీతాలు పాయింట్ ఉందన్నారు.
ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష
మద్యం తాగి వాహనాన్ని నడిపిన నర్సాపూర్ మండల కేంద్రంకు చెందిన సిహెచ్ చందుకు సోమవారం రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ నిర్మల్ న్యాయమూర్తి తీర్పు వెలువడించినట్టు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మద్యం తాగి వాహనాన్ని నడుపుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించడంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని తాగి వాహనాలు నడిపితే చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.