calender_icon.png 13 October, 2025 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై జరిగిన దాడికి నిరసనగా మహాధర్నా

13-10-2025 08:33:42 PM

వరంగల్ (విజయక్రాంతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై చెప్పు దాడిని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ ముందట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఎస్పీ జాతీయ నాయకులు, దళిత రత్న కల్లేపల్లి ప్రణయ్ దీప్ మాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై బూటు చెప్పుతో దాడి చేసిన రాకేష్ ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ రోజున జాతీయస్థాయిలో దేశవ్యాప్తంగా మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో అన్ని జిల్లా కేంద్రాల కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనని ధర్నా నిర్వహిస్తున్నాం అన్నారు.

దాడి వెనకున్న ఉన్న వ్యక్తులు, శక్తులు ఎంతటి వారినైనా తక్షణం అరెస్టు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ దాడి గవాయిపై జరిగిన దాడిగా మేము పరిగణించట్లేదు, ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో బొంగురు ఆనందరావు మాదిగ, ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కట్ల రాజశేఖర్ మాదిగ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.