21 March, 2026 | 5:18 AM

ఆటోస్టాండ్‌కు స్థలం కేటాయించాలి

21-03-2026 12:24 AM

ప్రభుత్వం ఇస్తామని చెప్పిన 12 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని బడ్జెట్‌లో ప్రకటించాలి

శ్రీ గణేష్ ఆటో యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కు వినతి

చర్ల, మార్చి 20, (విజయక్రాంతి): చర్ల మండల కేంద్రంలో ఆటో స్టాండ్ నిర్వహణకి స్థలం కేటాయించాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా ఆటో కార్మికులకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇవ్వాలని అందుకుగాను బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరుతూ చర్ల మండల శ్రీ గణేష్ ఆటో  యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో చర్ల మండలం ఎమ్మార్వోకి వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమానికి సిపిఎం మండల కార్యదర్శి మద్దతు తెలిపి మాట్లాడారు అదేవిధంగా ఆటో యూనియన్ మండల అధ్యక్షులు పామరు బాలాజీ మాట్లాడుతూ,ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఆటో డ్రైవర్ల కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ల కుటుంబాలతో పాటు ప్రయాణికుల సంక్షేమానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల ఆటో డ్రైవర్ల ఉపాధి పూర్తిగా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు దీనికి తోడు ప్రభుత్వం అనేక రకాలుగా టాక్స్ లను పెంచిందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం పెంచిన టాక్స్ రద్దు చేయాలని పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు చర్ల మండల కేంద్రం రోజురోజుకీ విస్తరిస్తుందని ఈ విస్తరణ కనుగుణంగా చర్ల బస్టాండ్ సెంటర్లో మరియు ఇతర ప్రధాన సెంటర్లలో ఆటో స్టాండ్లు నిర్వహణకు స్థలాలు కేటాయించాలని నిరుపేదలైన ఆటో డ్రైవర్లకు ఇంటి స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని  వినతి పత్రం ద్వారా ఎంఆర్‌ఓ ను కోరారు

ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ ఆటో యూనియన్ మండల కమిటీ సిఐటియు నాయకులు నాగరాజు వెంకట్రావు పోతురాజు సతీష్ అశోకు తులసి విజయ్  సంజీవ్ ప్రసాద్ సత్తిరాజు సంపత్ వెంకటేష్ పవన్ కిషోర్ నరసింహారావు రాజు ప్రసాద్ పాల్గొన్నారు.