నిరాశపరిచిన బడ్జెట్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడవ పూర్తిస్థాయి బడ్జెట్ కూడా నిరాశజనకంగానే ఉన్నది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానమైన ఆరు గ్యారెంటీలకి నిధులు పెంచకపోగా ఈ బడ్జెట్ లో గ్యారెంటీ లకి దరిదాపు 6 వేల కోట్ల రూపాయల మేరకు నిధులు తగ్గించటం వలన ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే అవకాశాలు కనిపించటం లేదు.
వ్యవసాయ రంగానికి నీటిపారుదల రంగానికి బడ్జెట్ లో నిధులు తగ్గించడమే కాదు విద్య ఆరోగ్య రంగాలకి సంతృప్తి కరస్థాయిలో బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా లాంటి కొత్త పథకాన్ని ప్రకటించినా ఆ పథకం అమలుకి సంబంధించిన నిధుల ప్రస్తావన బడ్జెట్ లో లేకపోవడం అనుమానాలకు తావిస్తుంది. మధ్యాహ్న భోజన పథకాన్ని డిగ్రీ కాలేజీలకి కూడా అమలు చేస్తేబాగుండేది. పెన్షన్ల పెంపు, మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకి 2500 రూపాయల ప్రస్తావన లేకపోవటం బడ్జెట్ నిరాశ జనకంగానే ఉన్నది.
డాక్టర్ తిరుణహరి శేషు




