14 July, 2026 | 4:50 AM

ఫైనల్ కాని ఫైనల్

14-07-2026 12:00 AM

ఫ్రాన్స్‌తో స్పెయిన్ సెమీతుమీ

హోరాహోరీ పోరు ఖాయం

డల్లాస్, జూలై 13: సాకర్ ప్రపంచకప్ సెమీఫైనల్ పోరాటాలకు కౌంట్‌డౌన్ మొదలైంది. తొలి సెమీఫైనలో డల్లాస్ స్టేడియం వేదికగా ఫ్రాన్స్, స్పెయిన్ తలపడబోతున్నాయి. రెండు జట్లలోనూ అద్భుతమైన ఆటగాళ్లు ఉండడంతో ఈ మ్యాచ్‌ను ఫైనల్ కాని ఫైనల్‌గా అభివర్ణిస్తున్నారు. కిలియన్ ఎంబాపే సారథ్యంలోని ఫ్రాన్స్ జట్టు అద్భుతమైన అటాకింగ్ గేమ్‌కు చిరునామాగా చెప్పొచ్చు.

ఎంబాపేతో పాటు మిచెల్ ఒలిస్, ఉస్మాన్ డెమ్బెలే లాంటి స్టార్ ప్లేయర్లు ఫ్రాన్స్ బలాన్ని మరింత పెంచారు. ఫాన్స్ తరఫున ఎం బాపె అన్నీ తానై జట్టును నడిపిస్తున్నాడు. ఈసారి వరల్డ్‌కప్‌లో ఆడిన 6 మ్యాచ్‌లలో 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఎంబాపె తర్వాత ఒస్మోన్ డెంబ్లీ కూడా ఫ్రాన్స్‌కు బలమైన ఆటగాడు. ఫార్వార్డ్ ప్లేయర్ అయిన డెంబ్లీ ఆరు మ్యాచ్‌లలో ఐదు గోల్స్ చేసాడు.

మరోవైపు డిలా ఫ్యూయెంటే కోచింగ్‌లో ఆడుతున్న స్పెయిన్, తమదైన పాసింగ్, బాల్ పొ సెషన్ గేమ్‌తో పత్యర్థులను ఒత్తిడిలోకి నెడు తూ అదరగొడుతోంది. యంగ్ స్టార్ లా మిన్ యమల్, రోడ్రి, పెడ్రి ఈ జట్టుకు ప్ర ధాన బలం. వీరితో పాటు మైకెల్ ఒయర్జబాల్ ఆరు మ్యాచ్‌లలో 4 గోల్స్ చేశాడు. ఈ రెండు జట్లు ఇప్పటివరకు మొత్తం 38 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడగా స్పెయిన్‌దే పైచే యిగా ఉంది. స్పెయిన్ 18 గెలవగా, ఫాన్స్ 13 గెలిచింది. 7 మ్యాచ్‌లు డ్రాగా ముగిశా యి. ఈ మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయమని చెప్పొచ్చు.