01-08-2025 08:34:12 AM
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు(US President Donald Trump) నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలనే డిమాండ్ ను వైట్ హౌస్ పునరుద్ఘాటించింది. ట్రంప్ నెలకు సగటున ఒకటి చొప్పున శాంతి ఒప్పందాలు కుదుర్చుతున్నారని వైట్ హౌస్ ప్రకటించింది. ట్రంప్ అనేక ప్రాంతాల్లో కాల్పుల విరమణలకు మధ్యవర్తిత్వం వహించారని పేర్కొంది. ఇటీవల థాయ్ లాండ్, కంబోడియా మధ్య కాల్పుల విరమణకు సాయం చేశారని స్పష్టం చేసింది. ఘర్షణలు ఆపకపోతే వాణిజ్య చర్యలు ఉండవని ట్రంప్ చెప్పారని వైట్ హౌస్ తెలిపింది. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణపై వైట్ హౌస్ మరోసారి మాట్లాడింది. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ట్రంప్ ఆపారని మరోసారి టముకు వేసింది. ఇజ్రాయెల్- ఇరాన్(Israel- Iran), రువాండా-కాంగో యుద్ధాన్ని ట్రంప్ ఆపారని చెప్పింది. సెర్బియా-కొసావో, ఈజిప్ట్-ఇథియోపియో మధ్య విభేదాలను ట్రంప్ ముగించారని పేర్కొంది. ఇప్పటికే ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి(Nobel Prize) రావాల్సిందని వైట్ హౌస్ వెల్లడించింది.