01-08-2025 09:15:09 AM
హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ రాజీవ్ రహదారిపై(Sultanabad Rajiv Road) వేగంగా దూసుకొచ్చిన లారీ, కంటైనర్ ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు క్లీనర్లు లారీ క్యాబిన్ లో చిక్కుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు క్లీనర్లను బయటకు తీసుకొచ్చేందుకు స్థానికులు ప్రయత్నించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.