calender_icon.png 2 August, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు బీహార్‌ ఓటరు జాబితా విడుదల

01-08-2025 09:06:54 AM

న్యూఢిల్లీ: బీహార్‌లో ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ ను ఎన్నికల కమిషన్(Election Commission) నేడు విడుదల చేయనుంది. అర్హుల పేర్లు ఏవైనా తొలగించి ఉంటే ఫిర్యాదు చేయాలని ఈసీ ప్రకటించింది. నేటి నుంచి సెప్టెంబర్ 1 వరకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఎస్ఐఆర్ కు ముందు బీహార్‌లో 7.93 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ జాబితా సమగ్ర సవరణ కోసం ఈసీ తనిఖీలు చేసింది. సిబ్బందికి 7.23 కోట్ల మంది పత్రాలు సమర్పించినట్లు ఈసీ ప్రకటించింది. 35 లక్షల మంది వలస వెళ్లగా, 22 లక్షల మంది మరణించారని ఈసీ తేల్చింది.

7 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ ఓటర్లుగా నమోదు చేసుకున్నారని తెలిపింది. 1.2 లక్షల మంది ఓటర్లు పత్రాలను సమర్పించాలని ఈసీ పేర్కొంది. బీహార్‌ ఎన్నికల ముందు ఎస్ఐఆర్ నిర్వహించడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఓటర్లను తొలగించి ఎన్ డీఏకు అనుకూలంగా ఈసీ వ్యవహరిస్తోందని ఆరోపించాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చొరవ కింద ఎన్నికల సంఘం నేడు బీహార్‌లో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనుంది. బీహార్‌లోని 38 జిల్లాల్లోని గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు జిల్లా ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితా భౌతిక, డిజిటల్ ఫార్మాట్‌ను కూడా అందిస్తారని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్(Chief Election Commissioner Gyanesh Kumar) చెప్పారు.