17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సాధారణ ప్రసవాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

27-12-2025 01:39 AM

పీహెచ్ సీని తనిఖీ చేసిన కలెక్టర్ రాహుల్ రాజ్

పాపన్నపేట, డిసెంబర్ 26 : సాధారణ ప్రసవాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్య సిబ్బందికి ఆదేశించారు. శుక్రవారం పాపన్నపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్ సీ లోని రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది, ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వాక్సినేషన్ ను పరిశీలించారు. ప్రతి రోజూ హాస్పిటల్ కు ఎంత మంది రోగులు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు.

ఈ నెలలో ఎన్ని డెలివరీల లక్ష్యం ఉందని, ఇప్పటిదాకా ఎన్ని చేశారని, సాధారణ ప్రసవాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, జిల్లాలో ఆరోగ్య సేవలు మరింత మెరుగుపడ్డాయని తెలిపారు. హాస్పిటల్ కు వచ్చే రోగులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని సూచించారు. హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.