calender_icon.png 27 December, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా తులసి కల్యాణం

27-12-2025 01:37:22 AM

జహీరాబాద్, డిసెంబరు 26 : తులసి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జరా సంఘం మండలంలోని శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శి ఖామణి అవధూత గిరి మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తులసి కళ్యాణోత్సవంలో పలువురు ప్రజా నాయకులు ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శిఖానమని ఒక వంద ఎనిమిది పీఠాధిపతి అవతజగిరి మాట్లాడుతూ తులసిమాత చా లా పవిత్రమైనదని తెలిసి వృక్షము అనేక రుగ్మతలను తొలగిస్తుందని ప్రతి మహిళ ప్రతిరోజు ఉదయం తులసి పూజ చేయాలని ఆయన తెలిపారు. ఈ గృహంలో అయితే తులసి పూజ నిర్వహించబడుతుందో ఆ గృహంలో లక్ష్మి కళకళలాడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్ర మంలో ఆశ్రమ మాతాజీ అనసూయ మాత నందిని మాత సిద్దేశ్వర నందగిరి మహారాజ్ గ్రామ సర్పంచ్ రాజు నాయకులు చింత చెట్టు రాజేందర్ ఉపసర్పంచ్ సిహెచ్ తుకారం అర్చకులు పాల్గొన్నారు.