calender_icon.png 27 December, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాసంగిలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

27-12-2025 01:43:52 AM

 శాశ్వత పంట కాలువలకు అవసరమగు నిధులు కేటాయించి కాలువల పనులు చెపట్టాలని కలెక్టర్ ను ఫోన్ లో కోరిన హరీష్ రావు

సిద్దిపేట డిసెంబర్ 26 (విజయక్రాంతి): వచ్చే యాసంగిలో  రైతులకు ఇబ్బందులు కలుగకుండా పంట పొలాలకు నీరు అందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఇరిగేషన్ అధికారులను కోరారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో  సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు గత యాసంగిలో ప్రభుత్వం సరైన ప్రణాలిక లేక రైతుల పంట పొలాలకు సాగు నీరు అందించడంలో ఇబ్బందులు కలిగాయని చెప్పారు. నా స్వంత డబ్బులు ఇచ్చి తాత్కాలిక కాలువ లు తీసి నీరు అందించే పరిస్థితి వచ్చిందని, అందుకే వచ్చే యాసంగి వరకు శాశ్వత కాలువలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.

అవసరమగు భూసేకరణ చెపట్టాలని భూసేకరణ కాలువల నిర్మాణానికి కావాల్సిన నిధులు ఇవ్వాలని ఫోన్ లో కలెక్టర్ ని కోరారు. ఇర్కోడ్, చందలపూర్ లో నిర్మించే లిఫ్ట్ పనులు వేగవంతం కావాలని కోరారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న చెక్ డ్యామ్ పనులు త్వరిత గతిన చేపట్టాలని చెప్పారు. కాలువల్లో పెరుక పోయిన తుంగా, చెత్త చెదారం పూడిక తీయీంచాలని అధికారులతో చెప్పారు. నియోజకవర్గంలో పలు పెండింగ్ పనులు వేంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ గోపాల్ కృష్ణ, ఈఈ శంకర్, డిఈ చంద్ర శేఖర్, శిరీష, వినయ్, ఆంజనేయులు, విద్యా సాగర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

చిన్నకోడూర్ రైల్వే స్టేషన్ పనులు ప్రారంభించాలి.

రైల్వే లైన్ లో భాగంగా జరుగుతున్న పనులలో సాగు నీటి కాలువల్లో మట్టి కూడుక పోయిందని వేంటనే తొలగించాలని రైల్వే అధికారులను హరీష్ రావు ఆదేశించారు. రైల్వే అధికారులు, ఇరిగేషన్ అధికారులతో కలసి చిన్నకొడూర్ మండలంలోని రైల్వే లైన్ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. చిన్నకోడూరు మండల కేంద్రంలో రైల్వే స్టేషన్ మంజూరు అయిందని స్టేషన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. స్టేషన్ పనులు వేంటనే ప్రారంభించాలని తగిన సూచనలు చేశారు.

చిన్నకోడూరు, మాచపూర్, గంగపూర్ విఠలాపూర్ వరకు జరుగుతున్న రైల్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైల్వే లైన్ క్రాస్ అయ్యే క్రమంలో కాలువల మీద రైల్వే బ్రిడ్జ్ లు పురోగతిలో ఉన్నాయనీ, అ పనులు యాసంగి లోపు పూర్తి చేయాలని రైల్వే అధికారులను కోరారు. వచ్చే యాసంగిలోపు రైతులకు ఇబ్బందులు కలగకుండా రైల్వే అధికారులు, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పని చేయాలని చెప్పారు.